వై.ఎస్.ఆర్ కడప జిల్లా, వంట నూనెల అధిక ధరలు, అక్రమ నిల్వలపై విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంటు దాడులు. వ్యాపారస్థులపై మరో 12 పైగా కేసులు నమోదు. ఇప్పటి వరకు 163 కేసులు పైగా నమోదు. వంట నూనెల అధిక ధరలపై ఆయిల్స్ దుకాణాలు మరియు మిల్లులపై కొనసాగుతున్న విజిలెన్సు దాడులు. ఈ దినము 17-03-2022 గురువారం కడప, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంటు విభాగపు రీజినల్ విజిలెన్స్ అధికారి బి. ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో 04 విజిలెన్సు విభాగపు టీములు కడప జిల్లా వ్యాప్తంగా సి.కే. దీన్నే, పెండ్లిమరి, వేంపల్లి, ప్రొద్దటూరు మరియు కడప పట్టణాలలో దాడులు నిర్వహించడం జరిగింది.
పట్టణాలలో దుకాణాలు, మిల్లులు మరియు సీడ్ గొడౌన్స్ మొత్తం 22 వ్యాపార సంస్థల మీద మమ్ముర తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు వంట నూనె అమ్ముతున్నటువంటి వ్యాపారస్తుల మీద మరియు ఇతర అక్రమాలకు పాల్పడుతున్న వారి మీద 12 కేసులు ఈ రోజు నమోదు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 355 వ్యాపార విభాగాల మీద దాడులు నిర్వహించి 163 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భముగా కడప, రీజినల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంటు అధికారి బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ వ్యాపారస్థులు వంట నూనె ధరల విషయంలో నియమ నిబంధనాలు పాటించాలని, అక్రమాలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఇటువంటి దాడులు ఇక కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పారు.
Comentarios