కడప-రేణిగుంట రహదారి నాలుగు లైన్ల నిర్మాణానికి పట్టు సాధించిన మిధున్ రెడ్డి, కొరముట్ల.
-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నుంచి ఆమోదం.
--జిల్లా ప్రజల హర్షం.
---మరి చిట్వేలి - కోడూరు రహదారికి మోక్షమెప్పుడు అంటున్న ప్రజలు.
కడప రేణిగుంట జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నుంచి ఆమోదం పొందడంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విజయం సాధించారు.
వారు ఇరువురు ఈరోజు రాత్రి న్యూఢిల్లీ నందు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మాత్యులు నితిన్ గడ్కరి ని, ఆయన చాంబర్ నందు కలిసి కడప-రేణిగుంట నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి సుమారు రూ.3300 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాగా ఆ రహదారి అనేక ప్రమాదాలకు నెలవుగా మారి ఎందరో కుటుంబాలను నిరాశ్రయులు చేసింది. అయితే నేడు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసుల కృషి వల్ల అమలు జరిగి త్వరగా విస్తరణ పొందితే అందరికీ ఉపయోగకరమని వారి కృషి చిరస్థాయిగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.
కాగా చిట్వేలు - కోడూరు జాతీయ రహదారి విస్తరణలో కూడా ఎంపీ,ఎమ్మెల్యేలు చొరవ చూపాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు రైల్వే కోడూరు వైస్ సర్పంచ్ తోట శివ సాయి పాల్గొన్నారు.
Comments