అనంతపురం జిల్లా, కదిరి లో గత ఏడాది నవంబర్ 16న కదిరిలో సంచలనం కలిగించిన టీచర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కదిరి డిఎస్పి భవ్య కిషోర్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు ఎన్జీవో కాలనీ లో మర్డర్ ఫర్ గేయిన్ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. హంతకుడు కదిరి పట్టణానికి చెందిన షేక్ షఫీ గా పోలీసులు గుర్తించారు.
హంతకుడిని పట్టుకున్న ఎస్సై హేమంత్ కుమార్ స్పెషల్ టీం: కదిరి ఎన్జీవో కాలనీ ఘటన జరిగినప్పటి నుండి కదిరి పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురై వణికిపోయారు . దొంగల భయంతో చాలా చోట్ల సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. మర్డర్ మిస్టరీమిస్టరీని ఛాలెంజ్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ పక్కిరప్ప కదిరి డిఎస్పి భవ్య కిషోర్ , టౌన్ సిఐ సత్యబాబు అద్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఎస్ ఐ హేమంత్ కుమార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉషారాణి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో ఎస్సై హేమంత్ కుమార్ టీంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, నాగరాజు, గోవర్ధన్ కీలకంగా వ్యవహరించారు.. తీగలాగితే డొంక కదిలినట్లు చిన్న క్లూ ఆధారంగా హంతకుడిని స్పెషల్ టీం గుర్తించగలిగింది. గతంలో కూడా ఎస్సై హేమంత్ కుమార్ చిన్న పిల్లల కిడ్నాప్ కేసులో కీలక పాత్ర పోషించాడు . కిడ్నాప్ కు గురైన పిల్లలను పూణే నుండి తీసుకొచ్చి ఉన్నత అధికారుల అభినందనలు అందుకున్నాడు. అంతేకాక జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిన నకిలీ పాసుపుస్తకాల వ్యవహారంలో కీలక వ్యక్తులను అరెస్టు చేసి అప్పట్లో అధికారుల మన్ననలు సైతం అందుకున్నాడు. సంచలనం కలిగించిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన కదిరి పోలీసులను జిల్లా ఎస్పీ పక్కిరప్ప ప్రత్యేకంగా అభినందించారు.
Comments