కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సర కాలంగా ఆర్టీపీపీ కృష్ణానగర్ మరియు కలమళ్ళ గ్రామంలోని పందుల యజమానులు ఇష్టానుసారంగా పందులను వదలడం వల్ల గ్రామం చుట్టుపక్కల ఉన్న వర్రీ పొలాలు మరియు పత్తి మినుము శనగ పంట లను పందులు తిరుగుతూ నానా బీభత్సం చేస్తూ రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని వాపోయారు యువ రైతు ఆదినారాయణ మాట్లాడుతూ చదువుకొని యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు దేశాలకు వెళుతుంటే రైతే రాజు అనే నిదానం తో సొంత ఊర్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని చేస్తున్నాను అని గత సంవత్సరం అక్టోబరు లో భూమిని కౌలుకు తీసుకుని ఆరు ఎకరాలో రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వరి పంట సాగు చేయగా వర్రీ పంట కోత కి వచ్చిన సమయానికి పందుల బీభత్సానికి లక్షా 30 వేల రూపాయలు నష్ట పోయామని స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేయగా స్పందించన కలమల్ల సచివాలయ సిబ్బంది గ్రామం చుట్టుపక్కల పందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చి స్పందనలో ఇచ్చినటువంటి ఫిర్యాదును ఇంటి దగ్గరకు వచ్చి వెనక్కి తీసుకోమని చెప్పి ఒప్పించి ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు ఆవేదన వర్ణనాతీతంగా వుంది రైతులు పందులు యజమానులకు తెలియజేయగా మాది కావు మాకు సంబంధం లేదంటూ సమాధానం ఇస్తున్నారు జనవరి నెలలో వరి సాగు చేయడానికి విత్తనాలు చల్లి మొలకలు వచ్చిన సమయానికి పందులు గుంపులు గుంపులుగా వచ్చి నష్ట పరిస్థితులున్నాయని ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
top of page
bottom of page
Comments