ఈ దుర్వాసన నుంచి కాపాడండి మహాప్రభో అంటున్న కలమల్ల గ్రామస్తులు
ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని వంక ప్రాంతంలో పశువుల పాక ఏర్పాటు చేసుకొని, విచ్చలవిడిగా మురుగునీటిని, బాత్రూం నీళ్లని రోడ్లపైకి వదులుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇదేమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపొమ్మని బెదిరిస్తున్నారని, చుట్టుపక్కల ఉన్న వారికి దుర్వాసనతో కూడిన శ్వాసకోశ సమస్యలు విష జ్వరాలతో బాధపడుతున్నామని వాపోతున్నారు. ప్రతి రోజు పశువులును వదిలేయడంతో రోడ్లపైనే నిద్రిస్తున్నాయని ప్రొద్దుటూరు కన్నెతీర్థం ఆర్టీసీ బస్సు డ్రైవర్ యజమానులకు తెలియజేయగా వినకపోవడంతో పాత కలమల్ల లోనికి బస్సు రాకపోవడంతో డిపో మేనేజర్ కి ఫోన్ చేసి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయడంతో బస్సు మరలా తిరిగి వస్తుందని తెలిపినట్లు, ఇప్పటికైనా పంచాయితీ అధికారులు స్పందించి వెంటనే కలమల్ల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు వేడుకుంటున్నారు.
Comments