నేడు ‘కళ్యాణమస్తు, షాదీ తోఫా’ నగదు జమ
జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.87.32 కోట్లు సీఎం జగన్ నగదు జమ చేస్తారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని చెల్లెమ్మలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనార్టీ చెల్లెమ్మలకు వైఎస్సార్ షాదీ తోఫాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. వధూ వరులిద్దరికీ 10 వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి, వధువు వయసు 18 వరుడి వయస్సు 21 ఏళ్ళు నిండాలి.
コメント