కనులవిందుగా శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మేడా దంపతులు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
హత్యరాల గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిత్రేతేశ్వర స్వామికి ఆదివారం కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తన్మయం చెందేలా కనులు విందుగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానంలో ఆదివారం శ్రీ కామాక్షిత్రేతేశ్వర స్వామి కళ్యాణోత్సవమునకు శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన రాజంపేట మేడా మల్లిఖార్జున్ రెడ్డి దంపతులను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు.
ఈ సందర్భంగా మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం సతిసమేతంగా స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామాక్షిత్రేతేశ్వర స్వామి దేవస్థానము చైర్మన్ వి.వెంకట సుబ్బారెడ్డి, రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందరం వేణుగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు మందరం గంగిరెడ్డి, వజ్ర శేఖర్ రెడ్డి, కమలేశ్వరరావు, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి, పాలగిరి మల్లికార్జున్ రెడ్డి, సత్యాల రామకృష్ణ, కొరముట్ల హరి, మలిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Comments