కడప జిల్లా కమలాపురం
ప్రసన్న ఆంధ్ర, పెండ్లిమర్రి ప్రతినిధి, మొన్నటి తుపాను కారణంగా కమలాపురం కడప రహదారి పాపాగ్ని నది మీద నిర్మించిన వంతెన కృంగిపోయిన విషయం తెలిసిందే, అయితే అన్హతపురం జిల్లా నుండి ప్రయాణికులు వాహనదారులు ఎర్రగుంట్ల కమలాపురం మీదుగా కడపకు ప్రయాణించేందుకు ఇది చాలా దగ్గరి మార్గంగా ఉన్న నేపథ్యంలో వర్ష ధాటికి పాపాగ్ని నది పొంగి ఇక్కడి వంతెన కృంగిపోగా స్థానిక ఏం.ఎల్.ఏ రవీంద్రనాథ్ రెడ్డి తాత్కాలిక మరమత్తులు చేపట్టి అప్రోచ్ వంతెన నిర్మాణం చేపట్టారు, అయితే ఆ అప్రోచ్ వంతెన పై అన్ని రకాల వాహనాలకు అనుమతి లేనందున, ప్రభుత్వం వెంటనే వంతెన నిర్మాణా పనులు చేపట్టింది, దానికి సంబంధించిన పనులు వేగవంతముగా జరుగుతున్నాయి, వంతెన నిర్మాణ పనులు పూర్తి అవగానే యదావిధిగా రాకపోకలు వంతెనపై కొనసాగించవచ్చు అని ఏం.ఎల్.ఏ తెలిపారు.
Comments