ప్రతి ఏడాది పుల్లంపేట మండలం, అనంతగారి పల్లె సమీపాన చిట్వేలు కు వచ్చే రహదారిలో పచ్చని పంట పొలాల మధ్య వెలసియున్న శ్రీ కనక రుద్రమ్మ తిరునాళ్ల మహోత్సవం చివరి రోజున ఈ రోజు దీప కాంతులతో అంగరంగ వైభవంగా జరిగింది.
వృషభ రాజులతో కూడిన బండ్లకు చేసిన అలంకరణలు.. "చాందిని బండ్లు" గా పిలువబడే.. అవి విశేషంగా నిలిచాయి. ఈరోజు ఉదయం మొదలు సుదూర ప్రాంతాల నుంచి మరియు కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ప్రాంగణం నిండిపోయింది.
ఆలయ ధర్మ కర్తలు మరియు భక్తులు వచ్చిన భక్తాదులు అందరికీ విశేషంగా అన్నదానాలు చేపట్టారు. వారు చేపట్టిన చెక్కభజన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. అశేష భక్త జనలు అమ్మవారినీ దర్శించి పునీతులయ్యారు.
Comments