మా ప్లాట్లు మా పేరు మీదనే ఉన్నాయి
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు శ్రీ కందుల బాలనాగిరెడ్డి కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీ ప్లాట్ల యజమానులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం వాజ్పేయి నగర్ పేరుతో ఉన్న శ్రీ కందుల బాలనాగిరెడ్డి కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీ లోని ప్లాట్ నెంబర్ 81 నుండి 113 వరకు ఉన్న తమ ప్లాట్లను నాడు ఆక్రమితదారులు చదును చేసి గుణాదులు నిర్మించే సమయంలో తాము అడ్డుకున్నామని, ఇందుకుగాను 2006వ సంవత్సరంలో తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, ప్రొద్దుటూరు డిఎస్పి కి కేసు విచారణ చేపట్టి తప్పుడు కేసుగా తేల్చారని, కాగా 2007వ సంవత్సరం నుండి 2015 వ సంవత్సరం వరకు పలుదపాలు అధికారులను స్థానిక నాయకులను ఆశ్రయించగా తమకు న్యాయం జరగకపోగా, కాలువ పరంబోకు స్థలమని తప్పుదారి పట్టించారని, పలుమార్లు జమ్మలమడుగు ఆర్డీవో, కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు విన్నవించిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందన కార్యక్రమంలో సమస్యను విన్నవించగా సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి 2022వ సంవత్సరం నాటికి హైకోర్టు వాస్తవాలను బేరిజు వేస్తూ, ఆరు నెలల లోపు ఆక్రమిత ఇళ్లను ఖాళీ చేయించి యజమానులకు అప్పగించమని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, వాజ్పేయి నగర్ వాసులు ఆరు నెలల గడువు కోరుతూ లిఖితపూర్వకంగా నాడు అంగీకరించారని, ఉన్నపలంగా పేదలను ఇల్లు ఖాళీ చేయిస్తే వారికి ఇబ్బంది అవుతుందని స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యజమానులకు స్థలం ఖాళీ చేయటానికి సమయం కావాలని అడుగగా తాము అంగీకరించామని అన్నారు. సమయం మించి పోవటంతో హైకోర్టు ద్వారా ఆర్డిఓ కు నోటీసులు అందించామని స్పందించిన ఆయన ప్రభుత్వ అధికారులచే ఇళ్లను ఖాళీ చేయించారని అన్నారు.
కాగా గత కొద్ది రోజుల నుండి తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా తాము పడిన అవస్థలు బాధలు ప్రజలందరికీ వివరించాలని ఉద్దేశంతో తాము పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశామని, తమ ప్లాట్లు తమ పేరు మీదనే ఇప్పటికీ ఉన్నాయని, తాము ఎవరికి ప్లాట్లను విక్రయించలేదని అన్నారు. ఇందులో ఏ రాజకీయ పార్టీ నాయకులను తాము ఆశ్రయించలేదని, ఉన్నత న్యాయస్థానం వద్దనే వ్యాజ్యం వేసి సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తమకు న్యాయం చేకూర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. వాజ్పేయి నగర్ నందు కూల్చిన ఆక్రమిత ఇండ్ల స్థలాలను చదును చేసి తమ ప్లాట్లు తమకు అప్పగించాలని కోరారు. కార్యక్రమంలో వాజపేయి నగర్ ఆక్రమిత కందుల బాలనాగిరెడ్డి కో-ఆపరేటివ్ సొసైటీ కాలనీ ప్లాట్ ఓనర్స్ పలువురు పాల్గొన్నారు.
Commenti