top of page
Writer's picturePRASANNA ANDHRA

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

ప్రసన్న ఆంధ్ర గాజువాక ప్రతినిధి, గాజువాక వై సీ పి క్యాంపస్ ఆఫీస్ లో కాపులను బి సీ లో చేర్చాలని పోరాటం లో అప్పటి టి డి పి ప్రభుత్వం అతి దుర్మార్గం గా పెట్టిన కేసులను ఈ రోజు ఎత్తివేయటం తో పాటు కాపు నేస్తం ద్వారా కాపులను ఆర్ధికంగా బలోపేతం చేసినందుకు గాజువాక కాపు నేతల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయుటం జరిగింది. అనంతరం మాజీ గాజువాక శాసన సభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వై సీ పి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన బి సీ చెయ్యాలని దీక్ష శిబిరానికి వస్తున్న అరెస్టులు చేసి జైల్లో పెట్టించి అతి దుర్మార్గం గా కాపులకు అన్యాయం చేసారని అన్నారు ఎంతో మందిని అరెస్టు చేసిన జైల్లో పెట్టిన కనీసం పట్టించుకోని జనసేన నాయకుడు ఇప్పుడు నేనే కాపు నేతను అని చెప్పుకోవటం సిగ్గు చెటని అన్నారు ఈ కార్యక్రమం లో పల్లా చిన్నతల్లి, మార్డుపూడి పరదేశి, రాజన రామారావు, రెడ్డి జగన్నాధం, ఊరుకుటి చందు గంగులురి రోజా రాణి, పిట్టా రెడ్డి, సంపంగి ఈశ్వరరావు, రోజరాణి, బోండా సూరిబాబు, పెద్దాడ పండు, ఒమ్మి ఈశ్వరి, గోరుసు రామలక్ష్మి,జీలకర్ర పద్మా చిందడ మేరి, కాకినాడ పెంటరావు, ములకలపల్లి వెంకటేష్, ఉమా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


3 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page