పిఠాపురంలో వైసిపి ఫ్లెక్సీల వివాదం
కాపు నేస్తంకు మద్దతుగా వెలసిన 600 ఫ్లెక్సీలు
ఏర్పాటు చేసిన బీసీ నేత గుబ్బల తులసీకుమార్
ఫ్లెక్సీలు వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షుడు తీయించేసారని ఆరోపణ
వైఎస్సార్ కాపు నేస్తం కు మద్దతుగా శెట్టిబలిజ సామాజికవర్గంకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి గుబ్బల తులసీ కుమార్ ఫ్లెక్సీలు వేయించారు.
పిఠాపురం నియోజకవర్గంలో వేయించిన ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలతో పాటు మంత్రుల ఫొటోలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుంటూరు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీలో పెట్టిన గుండ్రంగా ఉన్న ఫ్లెక్సీ లు ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించాయి. కాపు నేస్తం సభకు విచ్చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి కు ఘన స్వాగతం పలికేందుకు గుంటూరు నుండి ఫ్రేమ్ లు రప్పించి సుమారు 600 ఫ్లెక్సీలను శెట్టిబలిజ సామాజిక వర్గం కు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గము, ఉప్పాడ కొత్తపల్లి జడ్పీటిసి గుబ్బల తులసీ కుమార్ స్వాగత ఏర్పాట్లు చేశారు.
శెట్టిబలిజ సామాజికవర్గం నుండి కాపు సామాజిక వర్గానికి మద్దతుగా ఫ్లెక్సీలు వేయించడం చర్చనీయాంశంగా కూడా మారింది. ఇదిలా ఉండగా శుక్రవారం తెల్లవారు జామున 2:30గంటల సమయంలో అదే పార్టీకి చెందిన గుబ్బల తులసీ కుమార్ వేయించిన ఫ్లెక్సీ లను తీయించేశారు. అడిగితే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఒత్తిడితో ఎమ్మెల్యే పెండం దొరబాబు తీయించేయమన్నారని, ఫ్లెక్సీలు తీయడానికి వచ్చిన వారు చెప్పారని రాజు తెలిపాడు. గతంలో కూడా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీ సమావేశంలో కూడా గుబ్బల తులసీ కుమార్ వేయించిన 400 ఫ్లెక్సీలు ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తీయుంచేసారని, తన సొంత నియోజకర్గమైన కాకినాడ రూరల్ లో ఫ్లెక్సీలు వైఎస్సార్సీపీ కి మద్దతుగా పెట్టినా తీయించేసారాని అందరూ అనుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం లో జరిగిన కాపునేస్తం పథకానికి మద్దతుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గుబ్బల తులసీ కుమార్ ఫ్లెక్సీ లు తీయించేయడం వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 7నియోజకవర్గాల్లో బీసీలు 50శాతం ఉన్నారని 2 సీట్లు కేటాయించాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేయడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది.
Comentários