కర్నాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆధిక్యంలో కొనసాగుతోన్న కాంగ్రెస్
పోస్టల్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం 50 దాటింది. 8 గంటల 40 నిముషాల వరకు వచ్చిన ఫలితాలలో... కాంగ్రెస్ 54, బిజెపి 40, జెడిఎస్ 13, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, వయో వృద్ధుల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కర్నాటక అసెంబ్లీ స్థానాలు 224, మ్యాజిగ్ ఫిగర్ 113, కాంగ్రెస్ అనుకూలంగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఉండగా, జేడీఎస్సే మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో తొలుత ఆధిక్యంలో బిజెపి కొనసాగింది.. ఆ తరువాత కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చింది. జేడీఎస్ పుంజుకుంటోంది.
Comments