ప్రొద్దుటూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ, సహయ సంక్షేమ శాఖ (ASWO) అధికారిని అయిన స్వర్ణ లత కు PDSO (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ) రాయలసీమ కన్వీనర్ ఓబులేసు ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ హాస్టల్స్ కు సంబంధించిన విషయాలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా PDSO రాయలసీమ జిల్లాల కన్వీనర్ ఓబులేసు మాట్లాడుతూ ప్రొద్దుటూరు తాలూకా పరిధిలో ని అమ్మాయిల,అబ్బాయిల హాస్టల్స్ చాలా అస్తవ్యస్తంగా వున్నాయని కనీస సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు నెలకు ఇచ్చే కాస్మోటిక్స్ ఛార్జీల ను వేంటనే విద్యార్థి ని, విద్యార్థులకు ఇవ్వాలని, పెంచిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీల నూ పెంచాలని, 2018 లో ప్రవేశపెట్టిన మెస్ ఛార్ట్ రద్దు చేసి కొత్త మెస్ చార్ట్ ను ఇవ్వాలని ,పెండింగ్ లోని మెస్ బిల్లులను వేంటనే వార్డెన్ లకు చెల్లించాలని, కొంతమంది వార్డెన్లు హాస్టల్స్ దగ్గర గా వుండాకుండా దూరప్రాంతాల నుండి అప్ అండ్ డవ్వాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమ్మాయి హాస్టల్స్ పై పర్యవేక్షణ చేయాలని, బయోమెట్రిక్ విధానం ఖచ్చితంగా పనిచేసే విధంగా కృషి చేయాలని మినరల్ వాటర్ సదుపాయాలు ప్రతి హస్టల్ కు వుండాలని RO ప్లాంటు ను ప్రతి హస్టల్ కు ఇవ్వాలని,మూసివేసిన ప్రతి SC హస్టల్స్ ను మల్లి తెరవాలని, ఈ కరోనా సమయం ప్రతి విద్యార్థి ని,విద్యార్థులకు మాస్క్, శానిటేషన్ బాట్లిలు ఇవ్వాలని వ్యాక్సినేషన్ 15సంవత్సర నుండీ 18 సంవత్సరాలు వున్నా వారికి తప్పకుండా వ్యాక్సినేషన్ వేయాలని ASWO కి వినతిపత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు విద్యార్థి నాయకుడు జయరాజ్ పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments