top of page
Writer's pictureEDITOR

బహుముఖ ప్రజ్ఞాశాలి కట్టా నరసింహులు

బహుముఖ ప్రజ్ఞాశాలి కట్టా నరసింహులు

కట్టా నరసింహులుకు నివాళి అర్పిస్తున్న విద్యావేత్తలు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


తెలుగు పండితుడిగా, కవిగా, రచయితగా, అవధానిగా, సాహితీ పరిశోధకునిగా, కైఫీయత్తుల పరిష్కర్తగా, పలు గ్రంథకర్తగా బహుముఖీనమైన ప్రజ్ఞావంతుడు విద్వాన్ కట్టా నరసింహులు అని పలువురు వక్తలు కొనియాడారు. పట్టణం లోని ఆర్ అండ్ బి బంగ్లా ఎదురుగా గల ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలలో బుధవారం ఉదయం స్వర్గీయ విద్వాన్ కట్టా నరసింహులు 76వ జయంత్యుత్సవం జరిగింది.

తెలుగు భాషా సంరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి గంగనపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కట్టా సహచరులు, బంధువులు, మిత్రులు, తెలుగు పండితులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయన ప్రతిభాపాటవాలను కొనియాడారు. కట్టాతో గల అనుబంధాన్ని వారు నెమరు వేసుకున్నారు. ఒంటిమిట్ట కోదండ రామునికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరామనవమి ఉత్సవాలు జరగడానికి దేవాలయ ప్రాచీనతను, ప్రాభావాన్ని ఆధారాలతో సహా చూపించి ప్రధాన కారకుడయ్యాడని వారు తెలియజేశారు.

ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో జన్మించిన విద్వాన్ కట్టా నరసింహులు అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థితికి చేరుకున్న ప్రజ్ఞావంతులని వారు కొనియాడారు. కార్యక్రమానికి ముందు గంగనపల్లి వెంకటరమణ, యు.పీ రాయుడు, పాఠశాల వ్యవస్థాపకులు నందకిషోర్ గౌడ్, పతకమూరి వెంకటరమణ, పలుకూరు వెంకటరమణ, విద్వాన్ వల్లూరు చిన్నయ్య, బివి నారాయణరాజు, హరిప్రసాద్, సుబ్రహ్మణ్యం, వేల్పుల వెంకట సుబ్బయ్య, పలుకూరు భారతి, మల్లెల హైమావతి తదితరులు కట్టా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.


21 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page