తుదిశ్వాస విడిచిన కట్టమీద రామకృష్ణారెడ్డి
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అలాగే టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు అయిన కట్టమీది కృష్ణారెడ్డి (డిపో కృష్ణారెడ్డి) గురువారం తెల్లవారుజామున సర్విరెడ్డి పల్లె గ్రామంలోని ఆయన స్వగృహం నందు నిద్రలోనే తుది శ్వాస విడిచారు. కృష్ణారెడ్డి టిడిపి చేపట్టే అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటమే కాకుండా, ప్రతి సంవత్సరం టిడిపి ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమంలో అధ్యక్షునికి నాగలి బహూకరించటం ఆనవాయితీగా వస్తోంది. ఆయన మృతి వార్త తెలుసుకున్న పలువురు టిడిపి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన స్వగృహం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. కాగా శనివారం నాడు కృష్ణారెడ్డికి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ ఉన్నట్లు, అయితే గురువారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడువగా, టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల టీడీపీ నేత చంద్రబాబు సంతాపం, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు.
ప్రొద్దుటూరు టీడీపీ నేత కె.రామకృష్ణారెడ్డి మృతి బాధాకరం అని అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. రామకృష్ణారెడ్డి మృతికి ఆయన సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ హయాం నుండి ప్రతి మహానాడులో తెలుగుదేశం జెండాలో భాగమైన నాగలిని ఆయన బహుకరిస్తూ నాగలి రామకృష్ణారెడ్డిగా ప్రసిద్ధి చెందారని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుండి క్రియాశీలకంగా పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామకృష్ణారెడ్డి ఆత్మకుశాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comentários