పేదరికమే అర్హత గా సంక్షేమ పథకాలు - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
రాష్ట్రంలో పేదరికమే అర్హత గా కులాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదర్బాద్ లో శనివారం కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సతీమణి రాచమల్లు రమాదేవి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నవరత్నల్లాంటి పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, ప్రతి ఇంటికి సుమారు 70 వేల నుండి రెండు లక్షల వరకు పైగా ఆర్థికంగా లబ్ధి చేకూరిందని, కాలనీలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి మాజీ మండల ఉపాధ్యక్షుడు రాజా రామ్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, సోములవారిపల్లి సర్పంచ్ ప్రశాంతి, మండల కన్వీనర్ ఓబులరెడ్డి, నాటక మండల చైర్మన్ బండారు సూర్యనారాయణ, జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొండ ధనలక్ష్మి, వైసీపీ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గురు స్వామి, ఎంపీటీసీ కేఎస్, బసిరున్, బాలాజీ, వార్డ్ మెంబర్ లక్ష్మీనారాయణ రెడ్డి, మనీ, గజ్జల కళావతి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Opmerkingen