మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : కె కె చౌదరి.
★ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పొంగూరు నారాయణ గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం పార్టీ చిట్వేలి మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు కె కె చౌదరి.
★ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నారాయణ అక్రమ అరెస్టు చేశారు.
★ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేరుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను సరిగ్గా నిర్వహించలేక చేతులెత్తేశారు.
★ కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, అరెస్టు వారెంటు చూపించకుండా ఏవిధంగా అరెస్టు చేశారు? కొడుకు వర్ధంతి కార్యక్రమాల్లో ఉండగా నారాయణ గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం.
★ ఎక్కడైనా నేరం చేస్తే అరెస్ట్ చేస్తారు...? వైసిపి ప్రభుత్వంలో మాత్రం ముందు అరెస్ట్ చేశాక ఏ నేరం మోపాలో అని ఆలోచిస్తున్నారు.
★ ప్రశ్నా పత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని ఓ వైపు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతుంటే అదే ఘటన లో మంత్రి నారాయణ గారిని బాధ్యులు చేస్తూ అరెస్ట్ చేయడం లో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలి.
★ వైసిపి మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు.
★ రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు.
★ రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారు. టిడిపి నేతలను, వారి ఆస్తులను, గౌరవ ప్రతిష్టలను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వైసీపీ ప్రభుత్వం మానుకోవాలి.
Comentarios