వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు స్థానిక ఐ.ఎం.ఏ మెడికల్ హాల్ నందు కె.ఎల్ యూనివర్సిటీ (డీమ్డ్ విశ్వవిద్యాలయం) నందు ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రొద్దుటూరు జూనియర్ కళాశాలల అసోసియేషన్ ప్రెసిడెంట్, దీప్తి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి, చైతన్య విద్యాసంస్థల ప్రిన్సిపాల్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ డా. జె. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య తరువాత ఉన్నత విద్యా ప్రమాణాలు గల కోర్సును ఎంచుకొని విద్యార్థులు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని, నైపుణ్యం, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు కె.ఎల్ యూనివర్శిటీ యాజమాన్యం దాదాపు వొంద కోట్ల రూపాయల స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం కె.ఎల్ యూనివర్సిటీ ప్రోగ్రాం గోడ పత్రికను ఆవిష్కరించారు. జూనియర్ కళాశాలల అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కె.ఎల్ యూనివర్సిటీ వారు ప్రొద్దుటూరులో అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియచేశారు. పట్టణంలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, అందువలన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్య కలగా మారిందని, అలాంటి సమయంలో యూనివర్సిటీ వారు ఇక్కడ అవగాహనా సదస్సు ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తమ యూనివర్సిటీలో బోధిస్తున్న పలు కోర్సులు, రాబోవు రోజుల్లో వాటి ప్రాముఖ్యత గురించి తెలిపారు. కార్యక్రమంలో కె.ఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. షణ్ముఖ, ప్రొఫెసర్ డా. రఘు, పలు జూనియర్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comments