పశు సంచార వైద్య వాహన్నాన్ని ప్రారంభించిన కొరముట్ల.
--పాడి పశు రైతులకు మరింత ఉపయోగమన్న ఎమ్మెల్యే.
ఈరోజు సాయంత్రం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణ పశు వైద్యశాల నందు మొబైల్ అభ్యులేటరీ వెటర్నరీ క్లినిక్ (MVAC) వాహనాన్ని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. తాను మాట్లాడుతూ మానవ తరహాలో పశువులకు కూడా ఇంటివద్దకే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల పశు సంపద కలిగిన వారికి ఎంతగానో ఉపయోగ కరమని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరచుకోవాలి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పంజo సుకుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ సిఐ విశ్వనాధ రెడ్డి,పట్టణ కన్వీనర్ రమేష్, వెటర్నరీ ఏడి డాక్టర్ విజయ్ కుమార్,డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments