అగనంపూడి ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, కొండయ్యవలస సచివాలయం పరిధిలో ఉన్న అపరిష్కృత పనులను సందర్శించిన అఖిలపక్ష నాయకులు.
జీవీఎంసీ 85 వార్డ్ కొండయ్య వలస సచివాలయం పరిధిలో ఉన్న పశువుల ఆసుపత్రి, కొండయ్యవలస, అట్టావానిపాలెం, పెద్దమడక, అగనంపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శ్రీ మరిడిమాంబ ఆలయం ఏరియా సందర్శించడం జరిగింది. ఎ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పశువుల ఆసుపత్రి నిర్మాణంనకు ఆ శాఖ నిధులు ఉన్నప్పటికీ జివిఎంసి వారు స్థలం క్లియరెన్స్ ఇవ్వకపోవడం, కొండయ్యవలస రామాలయం ప్రాంగణంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ,జిల్లా పరిషత్ హై స్కూల్ చుట్టూ, అట్టావాని పాలెం వద్ద సరైన డ్రైనేజీ నిర్మాణం లేక మురికి నీరంతా గ్రామంలోకి ప్రవహిస్తుందని, మరిడిమాంబ గుడి వద్ద అవుట్ లెట్ డ్రైనేజ్ లేకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతున్నారని, విద్యుత్ లైట్లు పారిశుద్ద్యం సమస్యలను సచివాలయం సిబ్బంది జివిఎంసి అధికారులకు, కార్పొరేటర్ దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా అన్నారు. కోవిడ్ వ్యాక్షన్ సచివాలయం వాలంటరీ సమాచారంతో గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొండయ్యవలస సచివాలయం మౌలిక సదుపాయాల కార్యదర్శి ఆర్ కిషోర్ మాట్లాడుతూ సచివాలయం కు వచ్చిన సమస్యలన్నీ సంబంధించిన అధికారులు దృష్టికి ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని అన్నారు.
అగనంపూడి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ బంధం అప్పల్రాజు వైయస్సార్ సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు విందుల రాజు తెలుగు యువత నాయకులు వడ్డాది శీను పాల్గొన్నారు,
Comments