ఇబ్బంది పడుతున్న పాదాచారులు వాహనదారులు
YSR కడప జిల్లా, ప్రొద్దటూరు మునిసిపల్ పరిధిలోని 41 వార్డులకు గాను అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా శరవేగంగా జరుగుతున్నాయి, అయితే ఇదే ప్రొద్దుటూరు పట్టణంలోని మునిసిపల్ 11 వ వార్డు కోనేటికాలువ వీధిలో గాంధీ రోడ్డు ఎంట్రన్స్ వద్ద కొద్ది దూరం నుండి ఒకవైపు మార్గం అనగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎటిఎం నుండి రాముల వారి ఆలయం వరకు పూర్తిగా అధ్వాన్న పరిస్థితులలో ఉంది, పట్టణంలోని చాలా మంది వాహనదారులు ఈ వీధి గుండా కోనేటికాలువ వీధిలో పచారీ సామాగ్రి కొనుగోళ్ళకు, షాపింగ్, శివాలయం సర్కిల్, మైదుకూరు రోడ్డుకు వెళుతుంటారు. రోడ్డు విస్తరణ దృష్ట్యా ఒకవైపు నివాస గృహాలు కొద్దిమేర తొలగించటం జరిగింది, అయితే అక్కడ సీసీ రోడ్డు నిర్మించలేదు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టలేదు, తొలగించిన ఇళ్ల నిర్మాణంలో వాడిన రాళ్లు కంకర, వానలకు ఇసుక తేలిపోయి బయటికి వచ్చి పాదాచారులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది, అయితే కొందరు వాహనదారులు నిబంధనలు అతిక్రమించి అవతలివైపు ఎదురుగా వస్తున్న వాహనాలకు ఎదురు వెళ్లి వాహనాలు నడపటం వలన ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతున్నాయి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రవేళల్లో స్కూల్, కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు అటుగా వెళ్ళటానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, 11వ మునిసిపల్ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన రమేష్ యాదవ్ MLC గా పదోన్నతి రావటంతో వార్డుపై ప్రత్యేక శ్రద్ధ కొరవడిందని, కావున సంబంధిత అధికారులు లేదా వార్డు ఇంచార్జ్ తగు చర్యలు తీసుకొని ఆ కొద్దిపాటి రోడ్డుకు మరమ్మత్తులు చేయవలసినదిగా వాహనదారులు పాదాచారులు కోరుతున్నారు.
Comments