ప్రొద్దుటూరు: గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించిన పలు సమస్యలను వైఎస్సార్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గురువారం విజయవాడలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచులకు ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఏడాదికొకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి సర్పంచులకు బ్రేక్ దర్శనానికి అనుమతించాలని, జనాభా ప్రాతిపదికన సర్పంచుల గౌరవ వేతనం పెంచాలని, సర్పంచులు వారి పదవీ కాలంలో మరణిస్తే వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పారిశుధ్య కార్మికులను నియమించుకునేందుకు నిధులు లేని పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన పారిశుధ్య సిబ్బందిని నియమించాలని విన్నవించారు. ఇంకా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధనుంజయరెడ్డి ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
top of page
bottom of page
Comments