వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో 27వ తేదీన కొనిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ తెలుగు సంవత్సర ఉగాది విశిష్ట ఆత్మీయ సాహిత్య పురస్కార ప్రధాన కార్యాక్రమం, టీటీడీ కళ్యాణ మండపం నందు ఆదివారం ఉదయం 9:00 గంటలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొణిరెడ్డి శివచంద్రారెడ్డి వ్యవహరించనుండగా, ముఖ్య అతిధులుగా వెన్నపూస గోపాల్ రెడ్డి (MLC, ప్రభుత్వ చీఫ్ విప్), ప్రొద్దుటూరు MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, విశిష్ట అతిధులుగా మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యులు మూలే సుధీర్ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది సాహిత్య పురస్కారాల ప్రధానోత్వవ కార్యక్రమం కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా లోని యాబై మంది కవులకు విశిష్ట సన్మానం, ప్రశంసా పత్రాలు, మొమెంటోలు అందచేయనున్నారు.
ఈ సందర్బంగా కొనిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ, జిల్లాల్లోనే ప్రప్రధమంగా యాబై మంది కవులకు సన్మానం చేయటం ఇదే మొదటిసారి అని, ఉగాది సందర్భంగా కవులను రచయితలను సన్మానించటం తనకు చాలా సంతోశాన్నిస్తోందని, ప్రొద్దుటూరు ప్రజల తరపున తమ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణదేవరాయాల విగ్రహం, పుట్టపర్తి నారాయణాచార్యులు విగ్రహం అలాగే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పాలాబిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సన్మాన కార్యక్రమానికి జిల్లాలోని విద్యావంతులు, సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, భాషోపాధ్యాయ పండితులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరారు. నాగముని నాయుడు నంగునూరు పల్లె నాగేష్, రవి, రాజుపాళెం రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
コメント