ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన కొనిరెడ్డి
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజషన్ గుర్తింపు పొందినటువంటి శ్రీ శ్రీ కళావేదిక మరియు ఇంధ్రాణి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 48 గంటలపాటు తిరుపతి లో జరగబోవు రెండు ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాల కరపత్రాలను కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు,రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివచంద్రారెడ్డి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో శతాధిక కవి సమ్మేళ్లనాలను జరిపిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుగు కవితా పరిమళాలను ఆంధ్ర దేశమంతటా వ్యాపింపజేస్తూ కవులను, కళాకారులను వెలికితీస్తూ నిరంతర సాహితీ సేవ చేస్తున్న డాక్టర్ కత్తిమాండ ప్రతాప్ అభినందిస్తూ. శ్రీ శ్రీ కళావేదిక చేస్తున్న ఈ సాహితీ సేవలు ఆదర్శనీయమంటూ కొనియాడారు. తిరుపతి లో జరగబోయే ఈ ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని పాల్గొనే కవులకు కళాకారులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షులు ఉదయగిరి దస్తగిరి, వార్డ్ మెంబర్ బందెల మోష, చంద్రబాబు రెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Good job