ఆత్మీయుల సలహా మేరకు నడుచుకుంటా
- రాచమల్లు రాచరికం సాగనివ్వను - సర్పంచ్ కొనిరెడ్డి
ప్రొద్దుటూరు మార్చ్ 23, ప్రసన్న ఆంధ్ర
కొత్తపల్లి పంచాయతీలో జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు అని, అందుకే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశానని, మా ఆత్మీయుల సలహా మేరకు నడుచుకుంటనని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివ చంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరు పట్టణంలోని కొనిరెడ్డి ఆయిల్ మిల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఐదవ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మేము పనిచేస్తున్నామని వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్యే లీడర్లను అనకదొక్కాలని చూస్తున్నారన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ప్రతిపక్షం పాత్ర పోషించామన్నారు.
ఎమ్మెల్యే, ఆయన బావమరిది, ఎమ్మెల్యే అన్నతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు టికెట్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిన ఫలితం లేదన్నారు. కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ, అసమ్మతి వర్గ నినాదం ఎమ్మెల్యే కు టికెట్ ఇవ్వకూడదని అభివృద్ధి కోసం పాటుపడే వారికి టిక్కెట్ ఇవ్వాలి అన్నారు. సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని మీ అందరి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించానన్నారు. కార్యకర్తలు దోచుకొని దాచుకున్న ఎమ్మెల్యేకు సహకరించొద్దని తెలిపారన్నారు. ఇంతవరకు వైఎస్ కుటుంబానికి అహర్నిశలు పనిచేశానన్నారు. నేను రాచమల్లు కోసం పనిచేయడం లేదని కేవలం వైయస్సార్ కుటుంబం కోసమే పాటుపడానన్నారు.
కార్యకర్తలు ఆత్మీయులతో కలిసి త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మెట్టుపల్లి లక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ సౌభాగ్యమ్మ, వార్డు సభ్యులు ఇస్మాయిల్, రమణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, వివి నగర్ సుమంత్, తాళ్లమ్మాపురం గిరి, తదితరులు పాల్గొన్నారు.
Super