Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లె పంచాయతి కార్యాలయంలో నేడు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై వెంటనే సమాలోచన చేసి తగు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు, పంచాయతీ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులను నియమించుటకు వచ్చిన GO ప్రకారం స్థానిక పంచాయతీ సర్పంచులకు తెలియకుండా బదిలీలు జరిగితే అది వారి ప్రయోజనాల కోసమేననీ, అలా జరిగితే రాష్ట్రం, జిల్లాలోని సర్పంచులు ఇబ్బందులకు గురవుతారని కావున సర్పంచుల ఆదేశానుసారం బదిలీల ప్రక్రియ ముందుగా తెలియచేయాలని ముఖ్యమంత్రిని కోరారు. కొందరు నాయకులు వారి స్వలాభం కోసం వారికి అనువయిన ఉద్యోగస్తులను బదిలీలు చేయించుకుంటున్నారని, కావున పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సర్పంచుల విన్నపాన్ని మన్నించి బదిలీల ప్రక్రియపై తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడు రవి ప్రకాష్ రెడ్డి, పోరుమామిళ్ల సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కె. రమణా రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఉప్పరపల్లె కాల్వలో సిల్ట్ (పూడిక) తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాదాపు ఐదు లక్షల రూపాయల పంచాయతీ నిధులతో సిల్ట్ తొలగింపు చేపట్టామని, రాబోవు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని టీచర్స్ కాలనీ, ఎన్.జి.ఓ కాలనీ సుందరయ్య కాలనీ, ఓం శాంతి నగర్ ల నుండి వచ్చే మురుగు నీటికీ ఆటంకం కలగకుండా పూర్తిగా సిల్ట్ తొలగింపు చేపట్టామని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు, గతంలో కానపల్లె పెద్ద కాల్వ, అమృత నగర్ కాల్వలలో సిల్ట్ తొలగించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, పంచాయతీ సెక్రటరీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Opmerkingen