ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు అర్థరహితం - సర్పంచ్ కొనిరెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి, అక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పై చేసిన వ్యాఖ్యలను సర్పంచ్ కొనిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, తనను కానపల్లి ప్రజలు ఒంటరి చేశారని రాచమల్లు అనటం హాస్యాస్పదంగా ఉందని, గడచిన కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాచమల్లు కానపల్లిలో విస్తృత ప్రచారం చేపట్టాలని నియోజకవర్గ నాయకులకు హుకుం జారీ చేసి నాయకులను కార్యకర్తలను కూడగట్టుకుని కానపల్లెకు వచ్చారే తప్ప, ఇక్కడి గ్రామ ప్రజలు ఆయనను ఆదరించలేదని అన్నారు.
ఎమ్మెల్యే ఇక్కడి ప్రజలకు కనీసం అందుబాటులో లేరని, అలాంటిది ఎమ్మెల్యే రాచమల్లు తనను ఇక్కడి ప్రజలు వెలేసినట్లు చెప్పటం సబబు కాదని హితువు పలికారు. ఈ ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు ను పదవీచిత్యుని గావించటానికి సిద్ధంగా ఉన్నారని, తాము టిడిపిలో చేరక ముందు జగన్ పై ఉన్న అభిమానంతోనే పార్టీలో కొనసాగామె తప్ప ఎమ్మెల్యే రాచమల్లును చూసి కాదని, ఆయన అన్యాయాలు అక్రమాలు భరించలేకనే టిడిపిలో చేరినట్లు తెలిపారు. ఈ ఎన్నికలలో ప్రొద్దుటూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేసి ఆయనను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం ఐదో వార్డ్ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, వైసిపి కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి తనను ఒక పాత్రికేయ సమావేశంలో ఏకవచనంతో సంబోధించడం జరిగిందని, తనపై లక్ష్మీదేవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఇక్కడి ప్రజాప్రతినిధి తమను పార్టీ నుండి సస్పెండ్ చేయించారని, కావున తాము ఇక్కడి టిడిపి అభ్యర్థి వరద ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు మునీర్, గౌస్ మహమ్మద్, జంబులాపురం రామాంజనేయరెడ్డి, రాజుపాలెం మాజీ జడ్పిటిసి వెళ్లాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments