కొనిరెడ్డి నా సోదరసమానుడు - రాచమల్లు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
కొనిరెడ్డి నా సోదర సమానుడు - రాచమల్లు
సమన్వయంతో ముందుకు సాగిపోతాం - కొనిరెడ్డి
ఇరు వర్గాల నేతల కార్యకర్తలలో ఆనందోత్సాహాలు...
కొన్నిరెడ్డిని అసమ్మతి నేతల చూపు ఎటువైపు...
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గత కొద్దికాలంగా రెండు వర్గాలుగా విడిపోయి ప్రభుత్వ కార్యక్రమాలు విడివిడిగా చేసుకుంటూ, అటు పార్టీకి, ఇటు అధిష్టానానికి విధేయులుగా తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్న నేతలు. విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు సాగిపోతామంటూ శనివారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే, ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై అలకబూనిన కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తానో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ వర్గానికి నాయకత్వం వహిస్తూ గత రెండు సంవత్సరాలుగా ఒంటరిగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న విషయం అందరికీ విధితమే. కాగా సమన్వయ లోపంతో అభివృద్ధి కుంటు పడకూడదు అనే సదుద్దేశంతో సర్పంచ్ కొనిరెడ్డి శనివారం ఉదయం ఎమ్మెల్యే రాచమల్లుతో కలిసి పార్టీ పెద్దల సూచనలు సలహాల మేరకు ఇకపై తాను పనిచేస్తానని రాచమల్లు తన సోదరులు సమానుడని, గత మూడు దశాబ్దాలుగా తమ స్నేహబంధం కొనసాగుతోందని, అన్నదమ్ముల వలె తాము కలిసి ఉండి ఇకపై నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలుపుతూ కేక్ కట్ చేసి, పుష్పగుచ్చాలు అందించి ఒకటైన ఇరువురు నేతలు.
ఇలా ఉండగా, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, కొనిరెడ్డి తన సోదర సమానుడని కాలేజీ రోజుల నుండి తాను కొనిరెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్నానని, అన్నదమ్ముల వలె కలిసి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వలన విడిపోయినప్పటికీ, తాము ఇరువురము రాజశేఖర్ రెడ్డి అభిమానులమని, వైసిపి పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులం అని తెలుపుతూ, కొనిరెడ్డి తన వర్గీయుడని, ఏనాడు తాను కొనిరెడ్డిని వేరు చేయలేదని, అభివృద్ధికి సహకరిస్తే కొత్తపల్లె పంచాయతీ రూపు రేఖలు మారుస్తామని హామీ ఇస్తూ, రాబోవు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత వైసిపి నాయకులు తీసుకున్నారని, 2024లో కూడా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రానున్నట్లు ఆయన తెలిపారు.
నేతలు ఒకటైనప్పటికీ, కొనిరెడ్డి వర్గంలోని కొందరు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అలకబూని కార్యక్రమానికి గైర్హాసరవటం ఇక్కడ కొసమెరుపు....
Comments