కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సోమవారం ఉదయం కడప కలెక్టర్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో సర్పంచుల సమస్యలు వెంటనే తీర్చాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్పంచుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని సత్వరమే పరిష్కరించాలని, పంచాయతీల యందు విద్యుత్ దీపాలు, మురుగునీటి కాలువల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కావున జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో తాము ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, తాము తమ సర్పంచులు రాబోయే ఎన్నికల్లో వారి వారి నియోజకవర్గాలలోని ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిగా చేయాలన్నదే తమ దృఢ సంకల్పముతో ఉన్నామని, కాగా నేడు సర్పంచుల సమస్యలు అధికమయ్యాయని, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్పంచుల సమస్యలను కూడా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని, 15వ ఫైనాన్స్ నిధులు పంచాయితీలో విద్యుత్ బకాయిలు చెల్లించడానికే సరిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి దాదాపు 100కు పైగా సర్పంచులు కడప నగరంలోని సర్పంచుల జిల్లా కార్యాలయానికి చేరుకుని, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని స్పందనలో ఫిర్యాదు చేశారు.
Comentarios