డిసెంబర్ 5న రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశం - కొనిరెడ్డి
వైయస్సార్ జిల్లా
కడప నగరం నందు మంగళవారం ఉదయం కడప జిల్లా సర్పంచుల సంఘం కార్యాలయంలో ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ 66వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సర్పంచులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి మాట్లాడుతూ, పంచాయతీ పరిధిలో సర్పంచులకు అధికారాలు కల్పించాలని గ్రామ వార్డు వాలంటీర్లు సర్పంచుల ఆదేశానుసారం పని చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని, సచివాలయాల్లో సర్పంచులు స్టేషనరీ ఇతరత్రా ఖర్చులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని చేజిక్కించుకుంటోందని పంచాయతీ అభిరుద్దికి నిధులు కేటాయించటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలలో తమ అనుమతి లేకుండా ఖర్చులు చేస్తోందని, రాబోవు రోజుల్లో రాష్ట్రస్థాయి సర్పంచుల కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల సమస్యలపై తాము తమ ధ్వని వినిపించనున్నామని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జనవరి అయిదవ తారీఖున తాడేపల్లిలో జరిగే రాష్ట్ర సర్పంచుల సంఘ సమావేశానికి జిల్లా నుండి ప్రతి ఒక్క సర్పంచు హాజరు కావాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో సర్పంచుల జీతాలు 3000 రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా సర్పంచులు పలువురు కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డిని శాలువాతో సన్మానించి తమ సంఘీభావం తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు, పల్నాడు బాపట్ల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకడపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి అఖిల భారత పంచాయతీ పరిషత్ ( న్యూఢిల్లీ) డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఉమ్మడి కడప జిల్లా సర్పంచులు పలువురు పాల్గొన్నారు.
Comments