ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో కొనిరెడ్డి
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఖాదరాబాదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు బైజూస్ వారి ద్వారా ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, ఉన్నత ప్రమాణాలు గల విద్యను ప్రతి పేద ఇంటి బిడ్డకు అందాలన్న సదుద్దేశంతో నేడు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్ ల పంపిణీ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆధునీకరణ పనులు, మౌలిక వసతుల కల్పన, యూనిఫామ్, పుస్తకాలు, బూట్లు, మధ్యాహ్న భోజనం అందించటమే కాక, అమ్మఒడి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులు ఇటు చదువు పట్ల మక్కువ కనబరాస్తూ, మరో పక్క క్రీడల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్ర మోహన్ రెడ్డి, పాఠశాల అధ్యాపక బృందం, కొత్తపల్లె పంచాయతీలోని పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Comments