బుధవారం నుంచి ఎమ్మెల్యే కొరముట్ల గడప గడప కార్యక్రమం - మండల ఈశాన్య మైన రాజుకుంట నుంచి ప్రారంభం - జయప్రదం చేయాలన్న మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులురెడ్డి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల కాలం లో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా ప్రతినిధులే తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన.. గడపగడపకు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు బుధవారం 11 వతారీకున మండల ఈశాన్య గ్రామమైన రాజుకుంట గ్రామం నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభిస్తున్నారని. ఇందులో ప్రత్యక్షంగా ప్రతి కుటుంబానికి వెళ్లి ప్రభుత్వం నుంచి చేకూరిన మరియు చెందాల్సిన సంక్షేమ పథకాల వివరాలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా తెలుసుకుంటారని మరియు ఆయా గ్రామాల సమస్యలను పరిష్కరించే వేదికగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమానికి చిట్వేలి మండల పరిధిలోని నాయకులు, ప్రతినిధులు,కార్యకర్తలు, అధికారులు సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి కోరారు.
Comments