జనం మెచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి.
---ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పథకాలు.
---కూటమిగా కాదు,ఒంటరిగా పోటీకి రావాలని ప్రతిపక్షాలకు సవాల్.
--గడపగడపలో ఎమ్మెల్యే కొరముట్ల.
తండ్రి రాజశేఖర్ రెడ్డి కి తగ్గ వారసుడిగా,ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెచ్చిన నేతగా, వారి గుండెల్లో స్థానం నిలుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో, వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి లతో కలసి చిట్వేలు గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారిని అడుగుతూ వారు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ప్రతిపక్షాలకు సవాల్:
ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని టిడిపి జనసేన లు.. వైసీపీ ప్రభుత్వం పై కుట్ర పన్నుతున్నాయని కొరముట్ల ఆరోపించారు. ఏ ఇంటికి వెళ్లిన మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారని, అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. విజయం తనదేనని నమ్మకం ఉంటే కలిసికట్టుగా కాదు ఒంటరిగా పోటీకి రావాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తాను నిలిచిన చోట గెలవలేని పవన్ కళ్యాణ్ మా ప్రభుత్వంపై విమర్శించడం సబబు కాదన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా వైసీపీ గెలుపును వారు ఆపలేరని ఇది ముమ్మాటికి నిజమని కొరముట్ల భరోసా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మి కర్, బి.రమణ రెడ్డి,ఎంపీపీ చంద్ర, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, తాసిల్దార్ శిరీష, ఎంపీడీవో శివరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు అన్సర్ , సుబ్బరాయుడు, గుండయ్య, హజరత్ రెడ్డి, మోచర్ల నరసింహులు ,నవీన్,అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments