గడప గడప కార్యక్రమానికి విచ్చేసిన కొరముట్ల కు ఘన స్వాగతం - సంక్షేమ ఫలాలు పై సంతృప్తిని వ్యక్తపరిచిన లబ్ధిదారులు - సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన "గడపగడప" కార్యక్రమం ఈ రోజు ఉదయం ప్రభుత్వ విప్,శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట గ్రామ పంచాయతీ చింతలచెలిక నుంచి ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొరముట్ల కురాజుకుంట గ్రామ వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
మొదటగా చింతలచెలిక లోని ప్రతి గడపకు వెళ్లి కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరిస్తూ వారు పొందుతున్న లబ్ధి వివరాలను వారికి ఉన్న సమస్యలను గురించి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా అక్కడికక్కడే అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. తదుపరి జోరుగా వాన ఉన్నప్పటికీ గడపగడప కార్యక్రమాన్ని రాజుకుంట లో సైతం ఎమ్మెల్యే కొరముట్ల నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు నేరుగా పొందుతున్న లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. విద్యా దీవెన, రైతు భరోసా, జగనన్న తోడు, ఆసరా, కాపు నేస్తం, వాహన మిత్ర ఇలా నవరత్నాల అన్నింటిలో అర్హులైన అందరూ అందుకు ఉంటున్నామని మునుపెన్నడూ ఈ విధానం లేదని జగన్ పాలన భేషుగ్గా ఉందని ప్రతి కుటుంబంలోని అర్హులు ఎమ్మెల్యే కొరముట్ల తో ఆనందాన్ని వ్యక్తపరిచారు.
గ్రామంలో తమకు అప్పగించిన ఆయా కుటుంబాల పరిధిలో నిష్పక్షపాతంగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందిన వాలంటరీ లను ఈ కార్యక్రమం నందు ఎమ్మెల్యే శాలువాతో సత్కరిస్తూ అభినందించారు.
జోరు వానలో కూడా ఆగని గడప గడప కార్యక్రమం :
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, ప్రదీప్ రెడ్డి, లింగం లక్ష్మి కర్, ఎంపీపీ చంద్ర, నవీన్, ఎంపీడీవో సమత, ఆర్ ఐ సునీల్, ఇరిగేషన్ డి ఇ చెంగల్రాయుడు, సిఐ విశ్వనాథరెడ్డి, ఎస్ ఐ వెంకటేశ్వర్లు, గృహ, విద్యుత్, ఉపాధి, వ్యవసాయ, విద్య, ఆరోగ్య అన్ని శాఖల అధికారులు స్థానిక వైసీపీ నాయకులు కనకరాజు, చిన్నారాయల్, లోకేష్ , మల్లి, వెంకటరమణ, ఆదినారాయణ,ప్రసాద్ చెర్లోపల్లిసర్పంచ్ ఈశ్వరయ్య, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు,సచివాలయ సిబ్బంది, వాలంటరీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments