top of page
Writer's pictureEDITOR

రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చెబుదాం - ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు

రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చెబుదాం.

-1937 చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని గత ప్రభుత్వం విస్మరించింది.

-గర్జనను అడ్డుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సీమ ద్రోహులుగా మిగిలిపోతారు.

- ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు

రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చాటి చెబ్బుదామని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఈరోజు సాయంత్రం రైల్వే కోడూరు పట్టణ వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నేడు కర్నూలు ఎస్టీబిసి మైదానంలో జేఏసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే రాయల సీమ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజధాని, హైకోర్టు, హెల్త్ సిటీ, ఐటీ సిటీ, టూరిజం హబ్, శివ రామ కృష్ణ కమిటీలు ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో స్టడీ చేసి భవిష్యత్ లో ఆయా ప్రాంతాలు వెనుకపడి పోకూడదని పాలనా వికేంద్రీకరణ కు శ్రీకారం చుట్టారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి తపిస్తుంటే ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు మాత్రం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం వికేంద్రీకరణకు అడ్డు పడుతున్నారని తెలిపారు. ఎవరైనా అడ్డుకునేందుకు కుట్రలు, కుదంతాలు చేస్తే వారు సీమ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. మనకు జరిగిన అన్యాయాన్ని రాయల సీమ గర్జన ద్వారా వినిపించి మన హక్కులను కాలరాసే వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, సర్పంచ్ వినోద్, నరేంద్ర, మాజీ సింగల్ బెండ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

58 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page