యితర రాష్ట్ర, దేశాలకే ఆదర్శం మనవాలంటరీ,సచివాలయ వ్యవస్థ - సేవా అవార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కొరముట్ల.
చిట్వేలు మండల పరిధిలోని ఉన్నత పాఠశాల వేమన కళావేదిక నందు ఈరోజు సాయంత్రం వాలంటరీ ల సేవా అవార్డుల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి ఆధ్వర్యం లో వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
చిట్వేలు మండల పరిధిలోని అన్ని గ్రామ వాలంటరీ లలో 240 మందికి గాను 5 మందికి సేవ రత్న, తక్కినవారికి సేవా మిత్ర అవార్డులను కొరముట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో... ప్రజా అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి చేరవేస్తూ, చిత్తశుద్ధితో, సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుల, మత,రాజకీయ బేధాభిప్రాయాలు చూడకుండా అర్హులందరికీ అందించడంలో వాలంటరీ ల పాత్ర ఘనమైనదని మొదట్లో విమర్శించిన ప్రతిపక్షాల నేడు మెచ్చుకునే స్థాయికి వారి పనితీరు ఉన్నది అని పేర్కొంటూ రాబోవు కాలంలో ప్రభుత్వం వాలంటరీ లకు అందిస్తున్న ఐదు వేల రూపాయల వేతనాన్ని పెంచేందుకు సమాయత్తం అవుతోందని.. వాలంటరీ లు మరింతగా తమ సేవలను ప్రజలకు అందించాలని తెలిపారు.
ముఖ్యమంత్రికి మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆరు లక్షల ఉద్యోగాలను ఏకధాటిగా నియమించన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని... నేడు ఇతర రాష్ట్రాలు, దేశాలు మన రాష్ట్ర పాలన వైపే మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు.
మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతినెల ఒకటో తారీఖున పింఛన్లను అర్హులకు ఇంటివద్దకే అందిస్తూ వారి మోములో నవ్వును నింపుతున్న వాలంటరీ లు ప్రభుత్వ నిజమైన వారదులని.. వారి సేవ వెలకట్టలేనిదని వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చంద్ర, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎంపిటిసిలు సర్పంచులు వైసిపి నాయకులు,ఎంపీడీవో సమత, ఎమ్మార్వో జీవన్ చంద్రశేఖర్, ఎస్సై వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు,మండల వ్యాప్తంగా వాలఎంట్రీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Commenti