top of page
Writer's pictureEDITOR

ఫోన్ ట్యాపింగ్‌పై మరో అడుగు ముందుకేసిన

ఫోన్ ట్యాపింగ్‌పై మరో అడుగు ముందుకేసిన కోటంరెడ్డి

నెల్లూరు, ఫోన్ ట్యాపింగ్‌పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు..

తన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవకాశం వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖకు నేరుగా ఫిర్యాదు చేస్తానన్నారు. ట్యాపింగ్‌పై ఆరోపణలు చేస్తే తన పైనే విమర్శలకు దిగుతున్నారన్నారు. తాను ఆరోపణలు చేసినప్పుడు మీరు కూడా సరైన పద్ధతిలో మాట్లాడాలన్నారు. తనపై శాపనార్దాలు పెట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రహదారులు, కాల్వల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని కోటంరెడ్డి పేర్కొన్నారు.

నన్ను తిట్టడం కాదు..


''కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి టెలిఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేయమని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాను. నన్ను తిట్లు తిట్టడం కాదు. అధికారం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించాను. నెల్లూరు రూరల్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలి. పొదలకురు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే వేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరిగుతున్నాయి. స్వయంగా సీఎం చూసి రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాల పూర్తి కాలేదు. వావిలేటుపాడులో 3 వేల మందికి ఇచ్చిన ఇళ్ల సమస్య నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దర్గామిట్టలోని బీసీ భవన్ కి నిధులు మంజూరు కాలేదు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలోనే నిలిచిపోయాయి. గణేష్ ఘాట్ రూ.15 కోట్ల 20 లక్షలు కేంద్రం నిధులు విడుదల చేశారు. అధికారుల సహకారం లేక పనులు జరగడం లేదు. రూ.30 లక్షల మందితో కులాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ ప్రాంతంలో రూ.15 కోట్లు అడిగితే సీఎం స్పందించి జీవో ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీతో శంకుస్థాపన చేసినా.. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. సీఎం ని కలిసి అడిగితే వెంటనే పూర్తి చేయమని అధికారులకి చెప్పారు. నెలలు గడుస్తున్నా పరష్కారం కావడం లేదు'' అని కోటంరెడ్డి పేర్కొన్నారు.


25 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page