కొత్తపల్లె పంచాయతీ 12వ వార్డులో సర్పంచ్ పర్యటన
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలోని 12వ వార్డు నందు ఆదివారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పర్యటించారు. వార్డు మెంబెర్ సాబీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డులోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, పలు సమస్యలు పలుకరించాయి. డిసీఎస్ఆర్ కాలనీలోని పలు వీధులలో మౌలిక వసతులు లోపించగా, మురుగు నీటి కాలువలు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి, దాదాపు అరవై అడుగుల మేర మట్టి రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకోగా నిర్మాణ వ్యయం అంచనా వేయవలసిందిగా సెక్రటరీ నరసింహులు, ఇంజినీర్ మురళిలకు ఆదేశించిన కొనిరెడ్డి. మసీదు నుండి ప్రధాన కూడలి వరకు నూతన రోడ్డు నిర్మాణానికి డి.ఎం.ఎఫ్ నిధుల వెచ్చించి రాబోవు సర్వసభ్య సమావేశంలో సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు, డ్రైనేజీ వ్యవస్థను మరుగుపరచనున్నట్లు, దోమల నివారణకు కృషి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాబీర్, అబ్దుల్, మహబూబ్ ఖాన్, రాముడు, భద్రుడు, వెంకటసుబ్బయ్య, జాఫర్, షబ్బీర్ అహమ్మద్, మహమ్మద్ గౌస్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
Comments