top of page
Writer's picturePRASANNA ANDHRA

వక్స్బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాలి - ముస్లిం హక్కుల పోరాట కమిటి


వై.యస్.ఆర్. కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని ప్రెస్ క్లబ్ నందు ముస్లిం హక్కుల పోరాట కమిటి సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతపల్లె పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టిన కాలువ నిర్మాణ పనులతో వక్స్బోర్డు ఆస్తులలో కొద్దిభాగం అన్యాక్రాంతం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం హక్కుల పోరాట కమిటి సభ్యులు ప్రెస్ నోట్ విడుదల చేసి తగు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు.

ముస్లిం హక్కుల పోరాట కమిటీ ఇచ్చిన ప్రెస్ నోట్ సారాంశం :-


ప్రొద్దుటూరు మండలం, మోడంపల్లె గ్రామ పొలంకు సంబంధించిన మోడంపల్లె మసీదు అంజుమన్ ట్రస్టు, గరీబుల్ ఇస్లాం అంజుమన్ ట్రస్టు పేర్లతో మోడమీదిపల్లె, కొత్తపల్లె, తాళ్ళమార్పురం గ్రామపొలంలో మసీదుకు సంబంధించిన భూములు. అదే విధంగా షాహుశేన్ వల్లి స్వామి దర్గా, జామియా మస్జీద్, పీర్లచావిడి ఖబరస్తాన్లకు సంబంధించి 40 ఎకరాలు పైన ఆస్తులు, ప్రొద్దుటూరు, తాళ్ళమాపురం, ఉప్పరపల్లె, పల్లవోలు, బుడ్డాయపల్లె, బొల్లవరం, కల్లూరు, కల్లూరు ప్రక్కన అనంతపురం, కామనూరు, పొట్టిపాడు గ్రామాలలో భూములు ఉన్నవని. అట్టి ఆస్తులు వక్బోర్డు సర్వే కమీషన్ 1954 నుండి 1956 వరకు సర్వే చేశారని. సర్వే రిపోర్టు అనుసారం 1946లో కడప జిల్లా గెజిట్ నెం.13 గా ప్రభుత్వం వారు ప్రచురించి వక్బోర్డు పరిరక్షణలో సదరు ఆస్తులను ఉంచారు అని. వక్బోర్డు సర్వే రికార్డులు గాని, వక్బోర్డు గెజిట్ నెం.13లో గాని నమోదు కాని 50 ఎకరాల భూమి మసీదులు, దర్గాలు, ఆఘరానాలు, పీర్ల చావిడిలు, మదరసాలు, యతీమ్ ఖానా, ముసాఫీర్ ఖాన, అన్నదాన సత్రములు సంబంధించిన భూములుగా ఉన్నవి. ఇదే విధంగా జిల్లా మొత్తాన్ని గ్రహిస్తే ఎన్ని వేల ఎకరాలు భూములు ఉన్నాయో విషయం సర్వే చేస్తే గాని తేలని విషయం అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 13-10-2014వ తేదీన జి.ఓ.యం.యస్.నెం. 18,19, 59, 374, 6, తేదీ:22.05.2022 మైనారిటీ వెల్ఫేర్ జనరల్ డిపార్ట్మెంట్, మైనారిటీ వెల్ఫేర్ వక్స్- డిపార్ట్మెంట్ తేదీ: 22.04, 1997 రెవిన్యూ యస్.ఈ.ఆర్.-1 డిపార్ట్మెంట్ తేదీ:25.06.2002 మైనారిటీ వెల్ఫేర్ వక్స్-3, తేదీ: 12,03, 2007 ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేస్తూ 1) జిల్లా కలెక్టర్, 2) జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పొలీస్, 3) జాయింట్ కలెక్టర్, 4) జిల్లా డి.ఆర్.ఓ. 5) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ & బి, 6) జిల్లా పంచాయితీ ఆఫీసర్, 7) మున్సిపల్ కమిషనర్, 8) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 9) జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, 10) అసిస్టెంట్ డైరెక్టర్ యస్ & ఎల్.ఆర్, 11) జిల్లా రిజిస్ట్రార్, 12) డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సదరు ప్రభుత్వ అధికారులతో కూడిన ఒక కమిటీగా ఏర్పాటు చేసి వర్ఫ్ ఆస్తులను సంరక్షణ కల్పించు అత్యవసర అధికారులుగా నియమిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారులుగా నియమించబడి వున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 2వ రీ సర్వే నిర్వహించి భూమి హక్కులపై టైటీల్డీడ్ ఏర్పాటు కోసం సపరేట్ వెబ్ సైట్ ఓపెన్ చేసి భూముల హక్కుల భద్రత కల్పిస్తామని 29-07-2021వ తేదీన పేపర్ ప్రకటన ద్వారా ప్రకటించియున్నారు అని. సదరు ప్రకటన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించబడినది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎంత ప్రభుత్వ అధికారులను నియమించినప్పటికి వకోబోర్డు ఆస్తులు దినం దినం అన్యాక్రాంతం అవుతున్నాయన్న విషయం సర్వ ప్రభుత్వ అధికారులకు తెలిసిన విషయమే. ప్రజల ధనమానప్రాణ హక్కుల సంరక్షణ కొరకే సర్వప్రభుత్వ అధికారులు వున్నది. ప్రజల హక్కులను నిర్లక్ష్యంగా కాలవ్రాయడానికి కాదు అని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం వారు తీర్పులు చెప్పివున్నారు. అట్టి తీర్పులను గౌరవించి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించి కాంపౌండు గోడలు నిర్మించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి వర్ఫ్ ఆస్తులను రక్షణ కల్పించుటకు తగిన చట్టరీత్యా చర్యలు తీసుకొని కబ్జాదారులను వక్స్ ఆస్తుల నుండి తొలగించి వారిపైన సెక్షన్ 167 దేశద్రోహం క్రింద కేసులు నమోదు చేసి సదరు కబ్జాలు పునరావృతం కాకుండా తగు కఠిన చర్యలు తీసుకుంటూ వర్ఫ్ ఆస్తులను సకాలంలో రక్షణ కల్పించవలసినదిగా కోరుతూ 22-03-2022వ తేదీన సర్వే జరుగుతున్నందున ముస్లిం మైనారిటి జమాత్లు పాల్గొని సర్వేలో అవాంతరాలు జరగకుండా తమవంతు సహాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

56 views0 comments

コメント

5つ星のうち0と評価されています。
コメントが読み込まれませんでした。
技術的な問題があったようです。お手数ですが、再度接続するか、ページを再読み込みしてださい。
bottom of page