వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నేడు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, సెక్రటరీ నరసింహులు అధ్యక్షత ఉదయం 10:30 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించ్చారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎంపీటీసీలు, వార్డు మేంబర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే సమావేశానికి అనుమతించారు. ఏకైక అంశంతో ప్రారంభమైన ఈ సమావేశానికి వైసీపీ పార్టీలోని ఇరువర్గాల ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొనగా పంచాయతీ పరిధిలో కాంట్రాక్టు ఒప్పందం పై గత ఏడు సంవత్సరాలుగా పని చేస్తున్న దాదాపు పద్నాలుగు మంది పారిశుధ్య కార్మికులను తొలగించే విషయమై సుదీర్ఘ చర్చ జరిగినట్లు, ఒక వర్గం వైసీపీ నేతలు కార్మికులను తొలగించాలని పట్టు పడగా మరో వర్గం విభేదించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, దాదాపు పద్నాలుగు మంది కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను తొలగించాలని చేసిన ప్రతిపాదనను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని, వీరందరు పంచాయతీ పరిధిలో గత ఏడు సంవత్సరాలుగా విధులకు ఎటువంటి ఆటంకం గైర్హాజరు లేకుండా పని చేశారని, కార్మికులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని విధుల నుండి తొలగించాలని ప్రతిపాదన చేయటం హేయమైన చర్యగా ఆయన అభిప్రాయాపడ్డారు. పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మెండుగా జరుగుతుండగా, ఒక వర్గం వార్డు మెంబర్లు అడ్డుకునే ప్రయత్నం చేయటం సరి కాదన్నారు. పారిశుధ్య కార్మికురాలు సుధా మాట్లాడుతూ నేడు పద్నాలుగు మంది పారిశుధ్య కార్మికులను తొలగించటానికి చేసిన ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని, నేడు వారికి జరిగిన సంఘటన రేపు తమకు పునరావృతం కావచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులు సర్పంచ్ కొనిరెడ్డికి తాము వారం రోజుల వరకు విధులను బహిష్కరించి సమ్మెకు సిద్ధమయినట్లు రెప్రెజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం పంచాయతీలోని పదకొండవ వార్డు మెంబెర్ లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతూ తాము పై తెలిపిన పద్నాలుగు మంది పారిశుధ్య కార్మికులను గతంలో ఎన్నడూ చూడలేదని, అందువలనే తాము నేటి సర్వసభ్య సమావేశంలో కార్మికుల తొలగింపు అంశంపై చెర్చను ప్రస్తావించామని తెలిపారు.
Comments