వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రసాభసాగా సాగిన కొత్తపల్లె సర్వసభ్య సమావేశం
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
వైసీపీ నాయకుల వర్గపోరు బహిర్గతం
ప్రొద్దుటూరు నియోజకవర్గ కొత్తపల్లె పంచాయతీలో నేడు సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. ఉదయం 10:30 నిమిషాలకు ప్రారంభమైన సర్వసభ్య సమావేశం పోలీసుల భద్రతా పర్యవేక్షణలో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, సెక్రెటరీ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఒకే పార్టీకి(వైసీపీ) చెందిన నలుగురు ఎంపీటీసీ, ఇరవై మంది వార్డు మెంబర్ల వర్గపోరు తారా స్థాయికి చేరినట్లు సుస్పష్టమవుతోంది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి భిన్నంగా వాదోపవాదాల మధ్య నేటి సర్వసభ్య సమావేశం సాగిందని, వర్గ విభేదాల కారణంగా అజెండాలోని ఒక్కో అంశంపై సుదీర్ఘ చెర్చ జరిపి అంశాలను వాదోపవాదాల మధ్య ఆమోదించినట్లు తెలుస్తోంది. పదహారు అంశాల అజెండాతో నేటి సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగా, అజెండా లోని పదహారు అంశాలు చర్చకు వచ్చినట్లు, అందులోని 14 అంశాలకు మాత్రమే ఆమోదం తెలిపిన ఒక వర్గం వైసీపీ నాయకులు రెండు అంశాలను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్బంగా సమావేశం అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీకే చెందిన పలువురు వార్డు మెంబర్లు గతంలో తనతో విభేదించి పంచాయతీలో రెండవ వర్గంగా ఏర్పడి అభివృద్ధిని కుంటుపరుస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా ఏర్పడి పంచాయతీ అభివృద్ధిని అడ్డుకోవటం తగదన్నారు. పంచాయతీ పరిధిలో అభివృద్దకి తాను, తన వర్గం ప్రాధాన్యతనిస్తున్నామని అందుకోసం అహర్నిశలు శ్రమిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియచేసారు.
Comments