వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లె పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఇరవై ఆరు మంది స్వచ్ఛ భారత్ పారిశుధ్య కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు జమ కావటం లేదని, సిపిఎం పట్టణ కార్యదర్శి కె. సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు నేడు కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కొనిరెడ్డి స్వరూపా కు వినతిపత్రం ఇచ్చి తమ ఆవేదన వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా జీతాలు రాని మాట వాస్తవమేనని, కార్మికుల జీతాలు సకాలంలో అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతామని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి స్వరూప తగు చర్యలు తీసుకొని వారికి వేతన బకాయిలు అందేలా చేసి, రాబోవు రోజుల్లో ఆరు వేలుగా ఉన్న కార్మికుల జీతాలు పద్దెనిమిది వేలుగా పెంచే విధంగా నిర్ణయం తీసుకోవాలని, మునిసిపల్ కార్మికులకు ప్రభుత్వం అందిస్తోన్న నూనె, సబ్బులు, చెప్పులు, బట్టలు స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా ఇవ్వాలని, పి.ఎఫ్ ఈ.ఎస్.ఐ కల్పించాలని అలాగే హెల్త్ అలవెన్సులు కార్మికులకు అందివ్వాలని కోరారు.
కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ శ్రీమతి కొనిరెడ్డి స్వరూప మాట్లాడుతూ కార్మికులకు అందవలసిన వేతన బకాయిలు త్వరలో చెల్లించే విధంగా చర్యలు చేపడతానని, వారి సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం తరుపున కృషి చేస్తానని మాటిచ్చారు.
Comments