వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కోతపల్లె పంచాయతీలో గత కొద్ధి రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, నేటి ఉదయం పంచాయతీలోని పన్నెండు మంది వార్డు సభ్యులు, సర్పంచ్ కొనిరెడ్డి పై అసమ్మతి జ్వాలలతో రగిలిపోతూ స్థానిక ఎంపీడీఓ కు వినతి పత్రం సమర్పించిన సంగతి పాఠకులకు విదితమే. ఇదిలా ఉండగా నేటి సాయంత్రం కోతపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి ఆయన ఆయిల్ మిల్లు నందు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం చోటు చేసుకున్న సంఘటనలు తనను కలచివేశాయని, వార్డు మెంబర్లందరూ తన కుటుంబ సభ్యులని, కుటుంబంలో కలహాలు సాధారణమేనని, ఏ పంచాయతీలో జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు కోతపల్లె పంచాయతీలో జరుగుతుండగా, ఇది ఓర్వలేని కొందరు తనపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగా తమ వార్డు మెంబర్లను మభ్యపెట్టి తనపై ప్రతికూల ఆరోపణలు చేస్తున్నారని, పంచాయతీలోని ప్రజలను అడిగితే అభివృద్ధి పనులు వివరిస్తారని, పంచాయతీ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు శ్రమిస్తుండగా, వార్డు మెంబర్లు అమ్ముడుపోవటం సరయిన పద్దతి కాదని హితువు పలికారు.
పంచాయతీ అభివృద్ధి పనులలో భాగంగా అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ, పైపు లైను పనూలు చేపాట్టామని, అయిదు సచివాలయాలు నిర్మించనున్నట్లు, తన సొంత నిధులతో వీధి లైట్లు కొనుగోలు చేసి వార్డులోని పలు వీధులలో అమర్చామని, ఏనాడు తాను వీధలలో చెత్త బండి తిరగకుండా చేయలేదని, నీటి నిలుపుదల చేయవలసిన అగత్యం తనకు పట్టలేదని, 11వ వార్డు మెంబెర్ లక్ష్మి నారాయణ రెడ్డి ఉప సర్పంచ్ కావాలని తనని ఆనాడు కోరగా తాను అంగీకరించలేదని, అందుకే ఇలాంటి అసత్య ఆరోపణలు తనపై గుప్పిస్తున్నాడని తెలిపారు. తాను సర్పంచుగా ఎన్నికయి పదవి చేపట్టాక పంచాయతీలో అయిదు కోట్ల యాబై లక్షల నిధులు మాత్రమే ఉన్నాయని అందులో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి రెండు కోట్ల యాబై లక్షల రూపాయల పనులు చేయగా మరికొంత డబ్బులు ఇవ్వవలసి ఉందని, ఉన్న నిధులలో పంచాయతీలోని ఉద్యోగుల జీతాలు, డీజిల్ వగైరా ఖర్చులు దాదాపు కోటిన్నర ఉన్నాయని, పంచాయతీ కార్యాలయంలో జామా ఖర్చులు ఆడిట్ చేసి ఉన్నారని తెలిపారు. కాగా నేడు అసమ్మతి బూనిన ఏ వార్డు మెంబెర్ కూడా ఎన్నికలలో ఒక్క రూపాయి ఖర్చు చేయకపోగా, డబ్బులు ఇచ్చి గెలిపించిన తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి అయిదు కోట్ల రూపాయల డీఎంఎఫ్ నిధులు మంజూరు చేశారని, అందులో నుండి వార్డు మెంబర్లు తమ వార్డు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు, తనను మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు మానుకోవాలని, ఇలాంటి ఒడిదుడుకులు తన జీవితంలో తనకు కొత్త కాదని, అందరూ కలిసి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటునందించి ప్రజల మన్నన పొందాలని, ఎవరు పార్టీ కి పని చేస్తున్నారో అధిష్ఠానానికి తెలుసునని, ఇకనైనా అర్థరహిత ఆరోపణలు మానుకోవాలని కోరారు.
תגובות