వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాయలసీమ జిల్లాలలో అతిపెద్ద పంచాయతి ప్రొద్దుటూరు మండలం లోని కొత్తపల్లె, దివంగత మాజీ ఎమ్మెల్యే ఎం.వి రమణారెడ్డి కి కొత్తపల్లె పంచాయతి కంచుకోట, ఇక్కడి ఆధిపత్య పోరులో అటు ఎంవిఆర్ వర్గీయులు ఇటు కొనిరెడ్డి సోదరులు బాహాబాహీగా తలపడి గెలుపోటములు చవిచూశారు. కాగా 2021లో జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంవిఆర్ కోడలు మల్లెల ఉమా, కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి పోటీ పడ్డారు. మొత్తం ఇరవై వార్డులలో, మూడు వార్డులు మల్లెల ఉమ అభ్యర్థులు గెలువగా, మిగతా పదిహేడు వార్డులలో భారీ మెజారిటీతో కొనిరెడ్డి వర్గం గెలుపు సాధించింది. ప్రస్తుతం కొనిరెడ్డి, కొత్తపల్లె పంచాయతికి సర్పంచు గాను ఇటు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొనిరెడ్డి పై తొమ్మిది మంది వార్డు మెంబర్లు (ఆయన వర్గం) బాహాటంగా అసమ్మతిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుమారు పన్నెండు మంది వార్డు సభ్యులు ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా పంచాయతీ పరిధిలో వారి సమస్యలను ఎంపీడీఓ కి విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెలితే కోతపల్లె పంచాయతీకి సర్పంచ్ గా కొనిరెడ్డి ఎన్నికయిన నాడు, పంచాయతి ఖజానాలో దాదాపు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులు ఉండగా, ప్రతి వార్డులో పది లక్షల రూపాయలతో మౌలిక సదుపాయాలైన కాలువలు, రోడ్ల అభివృద్ధి పనులు చేపడతానని కొనిరెడ్డి మాట ఇచ్చి తప్పారని, నేడు పంచాయతీ నిధులలో ఏడు కోట్లు మాయం అయ్యిందని, నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తూ వార్డు మెంబర్లపై ఆధిపత్యం చలాయిస్తున్నారని, ఓట్లు వేసి గెలిపించిన వార్డులోని ప్రజలకు ఏ విధమయిన న్యాయం చేయలేక పోతున్నామని, అందుకే నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమళ్లు శివప్రసాద్ రెడ్డిని తాము ఆశ్రయించి, పంచాయతీలోని భూ ఆక్రమణలు, దౌర్జన్యాల నుండి ప్రాంచాయతి ప్రజలను కాపాడాలని కోరామన్నారు.
అలాగే మండలాధ్యకునికి. ఎంపీడీఓ లకు పంచాయతీలో తమ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా, అధికారులకు, పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇవ్వవలసిందిగా కోరారు.
Comments