కొత్తపేట నియోజకవర్గానికి మంత్రి పదవి ఈసారి కూడా కేటాయించకపోవడం అన్యాయం జరిగింది! రాయుడు లక్ష్మణరావు బీసీ నేత!
కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం చాలా చాలా అన్యాయం జరిగిందని, నియోజకవర్గ ప్రజల మనోభావాలను రాష్ట్ర అధిష్టానం తెలుసుకోలేదని, కొత్తపేట నియోజకవర్గంలోని ప్రజలు ఏమి తప్పు చేశారని, కొత్తపేట నియోజకవర్గానికి గతంలో ఏ ప్రభుత్వమూ ఏప్పుడూ మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. అయితే ఈసారైనా కోటి ఆశలతో ఎదురు చూసిన కొత్తపేట నియోజక వర్గం ప్రజలకు, ఈసారి కూడా కొత్తపేట నియోజకవర్గంనకు మంత్రి పదవి లేకపోవడం తీవ్ర నిరాశే మిగిలింది.
కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు అని, ఈ నియోజకవర్గంనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని అందరూ ఆశపడతున్న, ప్రతి ఒక్కరూ అనుకుంటున్న తరుణంలో ఈసారి కూడా కొత్త మంత్రివర్గంలో, కొత్తపేట నియోజకవర్గానికి స్థానం లేకపోవడం, రాకపోవడం అన్యాయమే, అదేవిధంగా కష్టకాలంలో ఉన్న పార్టీని కూడా కాపాడుతూ, పార్టీలు మారకుండా నిరంతరము, గత ప్రభుత్వంలో అవమానాలను ఎదుర్కొంటూ నడిచిన ఒక నాయకుడికి ఈసారి కూడా న్యాయం జరగకపోవడం, కొత్తపేట నియోజక వర్గ ప్రజల మనసులను తీవ్రంగా కలిసి వేసిందని, ఈ సందర్భంగా రాయుడు లక్ష్మణరావు తీవ్ర విచారము వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి ఉంటేనే నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందేవని, ఈ లాంటి పెద్ద నియోజకవర్గంనకు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చి ఉండేది అని, ఏప్పుడూ ఏలాంటి మంత్రిపదవులకు కొత్తపేట నియోజక వర్గం నోచుకోలేదని, ఈ ప్రభుత్వం కూడా దూరం పెడుతూ కొత్తపేట నియోజకవర్గం ప్రజల ఆశలపై నీళ్లు చెల్లిందని, ఏ ప్రభుత్వాలు అయినా ఇకనైనా తెలుసుకొవాలని, కష్టకాలంలో ఉన్నప్పుడు నిజాయితీగా నిలబడిన నాయకులకు అండదండలుగా అందించాలని, అదే విధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, నీతి కోసం న్యాయం కోసం పార్టీకి సేవలు చేస్తున్న నాయకులను, కొత్తపేట నియోజకవర్గానికి గుర్తింపు తీసుకు వచ్చే నాయకులను, అధిష్టానం ఏప్పుడూ మర్చిపోకూడదని, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ వ్యక్తులు బాగుండాలని మిత్రులుగా, స్నేహితులుగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయుచున్నాము, కోరుతున్నాము అని ఆయన తెలిపారు.
Commenti