చిట్వేలి లో జంతువులకు కు.ని ఆపరేషన్లు నిర్వహించిన పశువైద్యులు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం పరిధిలోని పశు వైద్యశాల నందు డాక్టర్ అబ్దుల్ అరిఫ్ ఆధ్వర్యంలో జంతువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుక్కల వల్ల కలిగే ఇబ్బందులు, మరణాలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని కొంతమేరకు వాటి సంతతిని తగ్గించాలని ఉద్దేశంతో ఈరోజు ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామని పెంపుడు కుక్కలను కలిగిన యజమానులు ఈ పద్ధతులను పాటించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
డాక్టర్ కె డి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలని అవసరం లేని జంతువుల సంతతిని ఈ పద్ధతి ద్వారా కట్టడి చేయాలని అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ తేజస్వి, గోపాల్, పశువుల ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments