కర్నూలు జిల్లా, కౌతాళం మండలం లో కరువు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తాసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య మాట్లాడుతూ కౌతాళం మండలం లో ఈ సంవత్సరం వర్షాలు ముందుకు రావడం వల్ల రైతులు పత్తి, మిరప, ఉల్లి, వేరుశనగ తదితర పంటలు వేసినారు. పంటలు బాగున్నాయని పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టినారు. పూత, మొగ్గ దశలోనే వర్షాలు పోవడం వల్ల ఎర్ర నెల భూములు పూర్తిగా ఎండిపోయిన ఈ, జూలై ఆగస్టు రెండు నెలలు వర్షాలు లేక పోవడం వల్ల రైతులు వేసిన పంట మొత్తం ఎండి పోయినది. కొద్దిపాటి ఉన్న పంట కూడా అక్టోబర్ నవంబర్ రెండు నెలలు వర్షాలు పూర్తిగా రావడం వల్ల ఉన్న పంట మొత్తం కుళ్లిపోయి పత్తి అయితే ఎకరాకు 2,3 క్వింటాలు కూడా రాని పరిస్థితి, మిరప అయితే అర్థ క్వింటాలు కూడా రానటువంటి పరిస్థితి రైతులకు ఏర్పడినదని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉండలేక రైతులు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు . కావున పత్తి వేసిన రైతుకు ఎకరాకు 30 వేల రూపాయలు, మిరప వేసిన రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు, ఉల్లి వేసిన రైతుకు 50 వేల రూపాయలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరువు, అకాల వర్షాలు విపత్తుల నుంచి రైతులను రక్షించడానికి ప్రత్యామ్నాయంగా తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మించాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, ఈరన్న, రైతు సంఘం నాయకులు రామాంజనేయులు, నర్సింలు, వెంకటేష్, వెంకన్న, వీరేష్, ఎస్ ఎఫ్ ఐ మాజీ నాయకులు వీరేష్ డప్పు కళాకారుల సంఘం బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Comentários