శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధాని చేయాలి... కర్నూలు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు వై బాలనాగిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధానుల వికేంద్రీకరణ బిల్లుపై జి.యన్ రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులు సైతం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు ను న్యాయరాజధానిగా గుర్తించాలని కర్నూలు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు వై బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారంనాడు సియం జగన్ సూచనల మేరకు నియోజకవర్గ కేంద్రం మంత్రాలయంలో ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో చేపట్టిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ నందు నవంబర్ 16,1937న జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందమని, ఆ ఒప్పందం ప్రకారం 1953 సంవత్సరం ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు చేయడంతో మొదలు, ఇప్పటి వరకు అపరిష్కృత నదుల నీటి పంపకాలు, యునివర్సిటీల ఏర్పాటు,కృష్ణ నది బోర్డు కార్యాలయం రాయలసీమలో ఏర్పాటు, అసెంబ్లీ సీట్లు పెంపుతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వంటి అంశాలను సూచించడం జరిగిందని, అందుచే రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ శ్రీబాగ్ ఒప్పందంను పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కు ముద్దపప్పు లోకేష్ పుత్రుడైతే, వీకెండ్ నాయకుడు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడని హేద్దేవా చేశారు. వీరి మాటలను ప్రజలు నమ్మరని, మళ్ళీ 2024లో జగనన్నకు పట్టం కట్టుతారని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా నాలుగు మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులచే ఒక్క రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అనే నినాదాలతో ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ప్రధాన రహదారి గుండా రాఘవేంద్ర సర్కిల్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. పిలిచిన వెంటనే ర్యాలీ కార్యక్రమానికి తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరున ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేణుగోపాల్ రాజ్, జేఏసీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మంత్రాలయం, కోసిగి, పెద్ద కడబూరు మండల కన్వీనర్లు భీమిరెడ్డి,మురళీ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి,మాధవరం రామకృష్ణరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్ర రెడ్డి, విజయేంద్ర రెడ్డి, రవీంద్రరెడ్డి, నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న, బెట్టనగౌడ్, మహాంతేష్ స్వామి, ఐరనగల్లు శ్రీనివాస రెడ్డి, నాడిగేని నాగరాజు, జగదీష్ స్వామి, మాణిక్యరాజు, దొడ్డినర్సన్న, కాంట్రాక్ట్ బసిరెడ్డి, రామాంజనేయులు, అశోక్ రెడ్డి, కురువ మల్లికార్జున, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపిటిసి సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments