కర్నూలు జిల్లా, జంట హత్య కేసులో 12 మంది ముద్దాయిలు అరెస్టు చేసినట్లు వెల్లడించిన కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్, వివరాల్లోకి వెళితే నిన్నటి దినం అనగా 27.01.2022 తేది న కౌతాళం మండలం కామవరం గ్రామంలో జరిగిన జంట హత్యల సంఘటన పై కౌతాళం పోలీసుస్టేషన్ లో క్రైమ్ నెం.15/2022 U/s 147, 148, 324, 307, 302 r/w 149 IPC and Sec.3(1) (r) (s) and 3(1) (V) of SC/ST POA act క్రింద కేసు నమోదు చేయడం జరిగినది. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ ను నియమించడం జరిగింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులందరూ కలిసి కట్టుగా దర్యాప్తు జరిపి ఈ ఘటనలో హత్యకు పాల్పడిన ముద్దాయిల పైన నిఘా ఉంచి అందులో 7 మందిని హైదరాబాద్ లో MGBS కు ఎదురుగా ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్ లో, 5 మందిని ఎమ్మిగనూరు దగ్గర మాసుమాన్ దొడ్డి గ్రామంలో అరెస్టు చేయడమైనది. అంతేగాక ముద్దాయిలు ఎ1 to ఎ6 లకు పారిపోవడానికి సహాకారం అందించిన బాపురం రామకృష్ణ పరమహాంస అలియాస్ చాకలి రామకృష్ణ ను కూడా అరెస్టు చేయడం జరిగింది. ముద్దాయిలకు సహాకరించినందుకు గాను ఇతని పై ఐపిసి 212 సెక్షన్ క్రింద చర్య తీసుకోవడం జరుగుతుంది అని, వారందరిని కూడా ఈ దినం కోర్టులో హాజరు పరచి తదుపరి దర్యాప్తు కోసం పోలీసు కస్టడికి తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
అరెస్టు అయిన ముద్దాయిల పేర్లు :
1) వడ్డె మల్లికార్జున ( వయస్సు 50) S/o. వి. హానుమంతు .
2) వడ్డె గోపాల్ (వయస్సు 22) S/o. వి. హానుమంతు
3) వడ్డె రాజు (వయస్సు 35) S/o. వి. హానుమంతు
4) వడ్డె ఈశ్వర్ (వయస్సు 25) S/o.వి. హానుమంతు
5) వడ్డె చంద్ర (వయస్సు 20) S/o. వి. హానుమంతు
6) రామంజనేయులు(వయస్సు 30) S/o. వి. హానుమంతు
వీరందరిది కామవరం గ్రామం, కౌతాళం మండలం.
7) బాపురం రామకృష్ణ పరమహాంస (వయస్సు 37) @ చాకలి రామకృష్ణ S/o. క్రిష్టయ్య , కౌతాళం గ్రామం. కౌతాళం మండలం,
8) వడ్డె ఉలిగమ్మ (వయస్సు 20) W/o ఈశ్వర్, కామవరం గ్రామం, కౌతాళం మండలం.
9) వడ్డె లక్ష్మీ (వయస్సు 43) W/o మల్లికార్జున , కామవరం గ్రామం, కౌతాళం మండలం.
10) వడ్డె జయమ్మ(వయస్సు 28) W/o రాజు, కామవరం గ్రామం, కౌతాళం మండలం.
11) వడ్డె ఈరమ్మ (వయస్సు 48) W/o లేట్ రాముడు , కామవరం గ్రామం, కౌతాళం మండలం.
12) వడ్డె లక్ష్మీ (వయస్సు 72) W/o లేట్ చిన్న హనుమంతు, కామవరం గ్రామం, కౌతాళం మండలం.
ఈ కేసులోని ముద్దాయిలను త్వరితగతిన అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలలో భాగమైన అధికారులు ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్, సిఐలు వెంకటశ్వరరావు, సుధాకర్ రెడ్డి, తబ్రేజ్, పార్ధసారది, ఎస్సైలు నరంద్ర కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రామయ్య, జి. చంద్ర, శివాంజల్, మన్మథ విజయ్, సునీల్ కుమార్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Комментарии